BPT: గ్యాస్ కొరత ఉందని ప్రచారం చేస్తూ సైబర్ నేరగాళ్లు గ్యాస్ బుకింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఆన్లైన్లో బుకింగ్ కోసం వెతికే వారే లక్ష్యమని, అనుమానాస్పద లింకులు, కాల్స్‌పై నమ్మకం పెట్టుకోవద్దని సూచించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.