AP: CM చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర కేబినెట్ భేటీకి ఆరుగురు మంత్రులు హాజరుకాలేకపోయారు. అనారోగ్యంతో హోమంత్రి అనిత, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, TG భరత్ ఈ సమావేశానికి రాలేదు. రేపటి జనసేన ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లలో బిజీగా ఉండి Dy.CM పవన్, మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశంలో పాల్గొనలేదు. మంత్రి ఫరూక్ తన భార్య సంవత్సరీకం కారణంగా రాలేకపోయినట్లు సమాచారమిచ్చారు.
NLG: చెస్ ద్వారా చదువుపై ఏకాగ్రత, చురుకుదనం, దృష్టి పెరుగుతాయని జిల్లా కలెక్టర్ బీ.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం గుర్రంపోడు మండలం కొప్పోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెస్ బోర్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చెస్ ఒక ఆట మాత్రమే కాదని, దీని ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని అన్నారు.
ATP: గుత్తి మండలంలో ఈ నెల 16 నుంచి జరిగే టెన్త్ క్లాస్ పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ శుక్రవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. మండల ప్రధాన కార్యదర్శి గౌతమ్ యాదవ్ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు.
VZM: గజపతినగరం వైసీపీ పరిశీలికురాలిగా మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్ శోభా స్వాతీ రాణి ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్బంగా వైసీపీ సీనియర్ నాయకురాలు శోభా హైమావతితో కలిసి శుక్రవారం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనువాసరావును ధర్మపురిలోని తమ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చిన్నశ్రీను స్వాతి రాణికి సూచించారు.
JNG: చిల్పూర్ గుట్ట దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం జరిగింది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్‌గా పొట్లపల్లి శ్రీధర్ రావు, ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
BDK: కరకగూడెం మండలంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారిని డీఎస్పీ రవీందర్ రెడ్డి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మండలంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ పై యుద్ధం, శాంతి భద్రతల వంటి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి నరేందర్, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ADB: అందరికీ ఆదర్శ మహిళ మొల్ల మాంబా అని ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామ సర్పంచ్ రేణుక అన్నారు. మొల్ల మాంబ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం లక్కారం కుమ్మరి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేశారు. మొల్ల మాంబ తెలుగులో మొదటి రచయిత్రి అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
SDPT: కోహెడలో ప్రసిద్ధ తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటుకూరి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాట్లాడుతూ.. ఆమె రచించిన మొల్ల రామాయణం సరళమైన భాషలో ఉండి తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులు శుక్రవారం పలు హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు మాట్లాడుతూ.. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను పరిమితికి మించి హోటళ్లలో వినియోగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
TPT: శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15న పుష్పయాగం నిర్వహించనున్నారు. ఉదయం స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం పుష్పయాగం జరుగుతుందని అధికారులు తెలిపారు. 14వ తేదీ నుంచి ఆలయంలో టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. పుష్పయాగం కారణంగా మార్చి 15న నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసినట్లు వెల్లడించారు.
GNTR: అమరావతి హైకోర్టు సమీపంలో నిర్మించనున్న నూతన అగ్నిమాపక కేంద్రానికి ఫైర్ డీజీపీ వెంకటరమణ శంకుస్థాపన చేశారు. వేద మంత్రాల మధ్య భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు 50 సెంట్ల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసే ఈ ఫైర్ స్టేషన్ అగ్నిప్రమాదాల నియంత్రణలో కీలకంగా ఉపయోగపడనుంది.
ADB: ఉట్నూర్ మండలంలోని నవోదయనగర్‌కు చెందిన ఆత్రం గంగూబాయి ఇటీవల బిడ్డను జన్మనిచ్చి మరణించింది. ఈమె భర్త గత నాలుగు నెలల క్రితం మృత్యువాత పడడంతో బాధిత చిన్నారి అనాథగా మారింది. దీంతో శుక్రవారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి చిన్నారికి అండగా ఉంటామని హమీచ్చారు. అదేవిధంగా రూ. 5,000 ఆర్థిక సహాయం అందించారు.
BHNG: భువనగిరి హైవే రోడ్డుపై పేదల జీవనాధారమైన టిఫిన్ సెంటర్లను టోల్ గేట్ అధికారులు అక్రమంగా కూలగొట్టడాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఖండించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా టోల్ గేట్ అధికారులతో మాట్లాడారు.
KDP: సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్లో శుక్రవారం కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ కే.ఆనంద రెడ్డి కవయిత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విలువలతో కూడిన కవిత్వాన్ని సమాజానికి అందించడంలో ఆమె ప్రత్యేకతని కమాండెంట్ కొనియాడారు.
NLG: దేవరకొండ మున్సిపాలిటీలోని 7వ వార్డులో నేడు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. 7వ వార్డు కౌన్సిలర్ హన్మంతు సాయి చంద్ర గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది కాలనీలోని మోరీలను శుభ్రం చేసి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.