SRCL: రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెలుకల తిరుపతి అన్నారు. శుక్రవారం రుద్రంగి మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్కెట్ కమిటీ ఆదాయ, వ్యయాల బడ్జెట్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.