KRNL: రాయలసీమ యూనివర్సిటీ ఎంబీఏ విభాగ అధ్యాపకుడు, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ జి. రామకృష్ణ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆయన విద్యా, ప్లేస్మెంట్, పరిపాలనా సేవలు అమూల్యమని తోటి అధ్యాపకులు తెలిపారు. అంకితభావంతో బోధనతో పాటు అనేక పరిపాలనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తించారు.
PLD: CM చంద్రబాబు ఈ నెల 19 నుంచి దావోస్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో, ఈ నెల 18న అమరావతిలో జరగాల్సిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. సీఎం విదేశీ పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మండల అధికారులు తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమ కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.
ATP: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ‘వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ పథకం’ విప్లవాత్మకమైనదని జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ పేర్కొన్నారు. అనంతపురంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ స్థానంలో వచ్చిన ఈ చట్టం ద్వారా పని దినాలను 125కు పెంచుతారని వివరించారు. ఈ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
NDL: కోయిలకుంట్ల పట్టణంలో ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి పల్లె మధుబాబు అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మధుబాబు మృతదేహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం మధుబాబు మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ATP: తాడిపత్రి మండల పరిధిలోని కడప హైవేపై సీఐ శివగంగాధర్ రెడ్డి శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. హుస్సేనాపురం వద్ద ఎస్సై కాటయ్యతో కలిసి నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ప్రతులను పంపిణీ చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని సీఐ సూచించారు.
VZM: గరివిడి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ ప్రాంగణం, విధుల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచాలని ఆదేశించారు. రహదారి భద్రత, సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు.
AKP: మంగర్లపాలెంలో శుక్రవారం శ్రీ శ్రీ శ్రీ రామాలయ ఆలయం వద్ద తీర్థ మహోత్సవం స్థానిక సర్పంచ్ బిడిజన రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మహోత్సవంలో భజనలు కోలాటాల హిందూ సంస్కృతి సాంప్రదాయాలతో జరిగాయి. ఈ కార్యక్రమం ముంగర్లపాలెం కమిటీ సభ్యులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
NDL: ఈనెల 18న ఎన్టీఆర్ 31వ వర్ధంతి పురస్కరించుకుని డోన్‌లో తారక రామ్ నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారని టీడీపీ మండల నాయకులు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఉదయం 9 లెజెండర్ బ్లడ్ డొనేషన్ రక్తదాన శిబిరం ప్రారంభిస్తారన్నారు. నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు హాజరుకావాలని కోరారు.
ATP: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన స్వగ్రామమైన అలంకరాయునిపేటలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. పండుగ వేళ కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి ఆయన ఉత్సాహంగా గడిపారు. యువతతో కలిసి క్రికెట్ ఆడటమే కాకుండా గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు. గ్రామస్థుల ఆత్మీయ పలకరింపులు, ప్రేమపూర్వక స్వాగతం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
KDP: రాయచోటి పట్టణంలో సంక్రాంతి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెన్నముక్కపల్లి వద్ద కాటమరాయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాందిని బండి, అలంకరించిన పశువులు ప్రజలను ఆకట్టుకున్నాయి. కులమతాలకు అతీతంగా చిట్లకుప్పను చూడటానికి భారీగా ప్రజలు తరలివచ్చారు.
తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఈ రోజు కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి భక్తిశ్రద్ధలతో గోపూజ నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కనుమ పండుగను ఆధ్యాత్మికంగా జరుపుకున్నారు. ఈ మహోత్సవంలో ఈవో అనిల్ సింఘాల్, టీటీడీ ఆలయ సిబ్బందిలు పాల్గొన్నారు.
GNTR: తుళ్లూరు మండలం పెదపరిమిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం గ్రామంలో జరిగిన దేవుని ఊరేగింపులో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. సతీసమేతంగా హాజరై స్వామివారి సేవలో తరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపులో నడిచి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ వేళ ఎమ్మెల్యే రాకతో గ్రామంలో సందడి నెలకొంది.
అన్నమయ్య: జిల్లాలో రాయచోటి రూరల్ పరిధిలోని చెన్నముక్కపల్లి గ్రామంలో కనుమ సందర్భంగా నిర్వహించిన చెట్లకుప్ప కార్యక్రమం ఘనంగా జరిగింది. కులమతాలకు అతీతంగా వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. రాయచోటి పట్టణ సీఐ చలపతి, ఎస్సై జహీర్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
సత్యసాయి: రొళ్ల మండలం మల్లసముద్రం గ్రామం మారక్క అనే యువతి కర్ణాటక మద్యం అమ్ముతుండగా పట్టుబడినట్లు ఎస్సై గౌతమి శుక్రవారం తెలిపారు. ఆమె నుంచి 4 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. యువతిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి ఉంచినట్లు ఆమె పూర్కొన్నారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తులు పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూలమాలలు వేసి పూజలు చేశారు. నందవరం గ్రామంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని గ్రామస్తులు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రసాదాలను ఇచ్చారు.