• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కేజీ మామిడి పండ్లు రెండు రూపాయలు మాత్రమే..!

TPT: పాకాల, ఐరాల మండలాల్లో సోమవారం రాత్రి గాలి, వానకు మామిడి కాయలు నేలరాలాయి. కొన్ని ప్రాంతాల్లో గాలి వానకు వడగండ్లు తోడవడంతో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. మరో వారం, పది రోజుల్లో కోతకు వచ్చే పంట నేలపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సుమారు 100 టన్నుల కాయలు రాలి ఉంటాయని అంచనా. ఈ మేరకు రాలిన కాయలను KG రూ.2-3 మద్య కొనుగోలు చేస్తున్నారు.

May 5, 2026 / 07:10 PM IST

సచివాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో

AKP: మాడుగుల మండలం పొంగలిపాక సచివాలయాన్ని ఎంపీడీవో కొంకి అప్పారావు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమయపాలన పాటించాలని, విధులు పట్ల అంకితభావంతో పనిచేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పమని హెచ్చరించారు. జనగణన కార్యక్రమాన్ని తక్షణమే ప్రారంభించాలని సూచించారు.

May 5, 2026 / 07:09 PM IST

ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు… స్థానికులు ఆందోళన

కోనసీమ: అమలాపురం మండలం నల్లమిల్లి ఎస్సీ స్మశాన వాటిక వద్ద 11 కేవీ విద్యుత్ వైర్లు చేతికందే ఎత్తులో ఉండి కిందకు వేలాడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని అక్కడ పని చేసే ఉపాధి శ్రామికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవసలని కోరుతున్నారు.

May 5, 2026 / 07:08 PM IST

మొసలి కన్నీరు కారుస్తున్న వైసీపీ నాయకులు

AKP: అచ్యుతాపురం మండలం దుప్పితూరు విషయమై వైసీపీ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం అచ్యుతాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో దుప్పితూరు విషయంలో వైసీపీ నాయకులు ఏమి చేయలేకపోయారని అన్నారు. నిర్వాసితులకు అన్యాయం జరగదని స్పష్టం చేశారు.

May 5, 2026 / 07:07 PM IST

గుంతకల్లులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి

ATP: గుంతకల్లు కూరగాయల మార్కెట్ సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మద్యం ఎక్కువగా తాగడం వల్లే మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

May 5, 2026 / 07:07 PM IST

ఆర్దిక సెలవులు మంజూరు చేయాలి: STU

VZM: టెన్త్ ఫలితాల్లో జిల్లా టాప్-3 స్థానంలో నిలవడం గర్వకారణమని రాష్ట్ర ఉపాద్యాయ సంఘం (STU) జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు అన్నారు. మంగళవారం స్దానిక అమర్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం సమంజసం కాదన్నారు. ఒకవేళ అలా నిర్వహించాల్సి వస్తే టీచర్లకు ఆర్థిక సెలవులు లేదా ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

May 5, 2026 / 07:07 PM IST

చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

అన్నమయ్య: జిల్లాలో దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర అంతర్రాష్ట్ర ముఠాను మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 4 కిలోల వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాయల్పాడు, బత్తలపల్లి సహా పలు జిల్లాల్లో వీరు చోరీలు చేసినట్లు విచారణలో తేలింది. కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ ధీరజ్ అభినందించారు.

May 5, 2026 / 07:06 PM IST

కొత్త ఇసుకపల్లి విద్యార్థికి డిప్యూటీ సీఎం అభినందనలు

KKD: కొత్తపల్లి(M) కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన ఆకుల పవన్ కుమార్‌ను ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అభినందించారు. పవన్ కళ్యాణ్ తన జీతాన్ని తల్లిదండ్రులు లేని పిల్లలను దేవుని బిడ్డలుగా భావించి రూ. 5 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. పవన్ కుమార్‌కు కూడా పవన్ ఆర్థిక సాయంతో చదివి పదో తరగతి పరీక్షల్లో 555 మార్కులు సాధించాడు.

May 5, 2026 / 07:05 PM IST

‘కేంద్రీయ విద్యాలయం వద్ద మినీ స్టేడియం నిర్మించాలి’

SKLM: క్రీడాకారుల సౌకర్యార్థం కేంద్రీయ విద్యాలయం సమీపంలో మినీ స్టేడియం నిర్మించాలని టీడీపీ నేతలు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. సుదికొండలో కేటాయించిన స్థలం బదులు పాఠశాల పక్కన 1.5 ఎకరాలు అనుకూలమని సూచించారు. దీనివల్ల విద్యార్థులు, యువతకు క్రీడల్లో అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

May 5, 2026 / 07:03 PM IST

జనగణన కిట్లు పరిశీలించిన కమిషనర్

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ జనగణన – 2027 కార్యక్రమానికి సంబంధించి సూపర్వైజర్ల కిట్లను కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం పరిశీలించారు. నిర్దేశించిన సమయంలోపు జనగణన సిబ్బంది కిట్లను పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యేందుకు దోహదపడాలని కమిషనర్ సూచించారు.

May 5, 2026 / 07:02 PM IST

మల్లేపల్లిలో రామాయణ పఠనం ప్రారంభం

KRNL: వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఇవాళ రామాయణ పఠనం ప్రారంభమైంది. రామాయణం మానవులకు మార్గదర్శక గ్రంథమని డాక్టర్ మల్లు వేంకట రెడ్డి తెలిపారు. ప్రవచనంలో డాక్టర్ తొగట సురేశ్ బాబు రామాయణ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

May 5, 2026 / 07:02 PM IST

‘గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూడాలి’

VZM: గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇవాళ జిల్లా NCD అధికారి డాక్టర్ టి. జగన్ మోహన్ రావు సూచించారు. దోనుబాయి, వీరఘట్టం PHC కేంద్రాలలో నిర్వహించిన ‘ఆశా డే’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఆరోగ్య కార్యక్రమాలు, వైద్య సేవలపై సమీక్ష జరిపారు. ముందుగా మే నెల ఆశా డే సారాంశంపై సమీక్షించారు.

May 5, 2026 / 07:01 PM IST

శ్రీసత్యసాయి జిల్లాకు వర్ష సూచన

SS: ద్రోణి ప్రభావంతో బుధవారం శ్రీసత్యసాయి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

May 5, 2026 / 07:00 PM IST

సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడపై ఆందోళన

GNTR: రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ను కలిశారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో థియేటర్ల రక్షణకు సంబంధించి పలు కీలక వినతులను సమర్పించారు.

May 5, 2026 / 06:55 PM IST

రైలు నుంచి పడి వ్యక్తి మృతి

ELR: తేలప్రోలు – నూజివీడు మధ్య కోడూరుపాడు మూసివేసిన రైల్వే గేటు సమీపంలో సుమారు 35 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఏలూరు రైల్వే ఎస్సై కృపాదానం తెలిపారు. రైలు నుంచి ప్రమాదవశాత్తు పడి మరణించినట్లు పేర్కొన్నారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, వంకాయ రంగు చొక్కా, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలకు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.

May 5, 2026 / 06:54 PM IST