SS: ద్రోణి ప్రభావంతో బుధవారం శ్రీసత్యసాయి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.