AKP: అచ్యుతాపురం మండలం దుప్పితూరు విషయమై వైసీపీ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం అచ్యుతాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో దుప్పితూరు విషయంలో వైసీపీ నాయకులు ఏమి చేయలేకపోయారని అన్నారు. నిర్వాసితులకు అన్యాయం జరగదని స్పష్టం చేశారు.