• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మల్లసముద్రం యువతిపై కేసు నమోదు

సత్యసాయి: రొళ్ల మండలం మల్లసముద్రం గ్రామం మారక్క అనే యువతి కర్ణాటక మద్యం అమ్ముతుండగా పట్టుబడినట్లు ఎస్సై గౌతమి శుక్రవారం తెలిపారు. ఆమె నుంచి 4 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. యువతిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి ఉంచినట్లు ఆమె పూర్కొన్నారు.

January 16, 2026 / 06:43 PM IST

చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయంలో పల్లకి సేవ

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తులు పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూలమాలలు వేసి పూజలు చేశారు. నందవరం గ్రామంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని గ్రామస్తులు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రసాదాలను ఇచ్చారు.

January 16, 2026 / 06:42 PM IST

కామవరపుకోటలో పండుగ వేళ.. నీటి కటకట

ELR: కామవరపుకోట పంచాయతీ పరిధిలోని 33 ఇళ్ల కాలనీలో మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పండుగకు బంధువులు రావడంతో నీటి వినియోగం పెరిగి, ప్రత్యామ్నాయం లేక ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

January 16, 2026 / 06:42 PM IST

50 కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

బాపట్ల జిల్లా మార్టూరు పోలీసులు భారీగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను శుక్రవారం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా గంజాయిని బెంగుళూరుకు తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి NDPS Act–1985 ప్రకారం కేసు నమోదు చేశారు.

January 16, 2026 / 06:41 PM IST

శ్రీ సూర్యనారాయణ స్వామి శోభాయాత్ర వాయిదా

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19న జరగాల్సిన ‘శోభాయాత్ర’ను 23వ తేదీకి మారుస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మృతికి సంబందించిన సంతాప దినాలు జరుగుతున్నందున వాయిదా వేసినట్లు తెలిపారు. అయితే భక్తులకు ఇబ్బంది ఉండదన్నారు.

January 16, 2026 / 06:40 PM IST

కోడిపందాలు బరి వద్ద నగదు ల్యాప్టాప్, నగదు చోరీ

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం – చేబ్రోలు కోడి పందాలు బరిలో ఓ కారు అద్దాలు పగల కొట్టి నగదు, లాప్ టాప్ శుక్రవారం చోరీ చేసారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కారును పరిశీలించారు. చోరీ ఎవరు చేశారని చేబ్రోలు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

January 16, 2026 / 06:39 PM IST

పట్టపగలే బీసీ పాయింట్‌లో దుండగులు చోరీ

ATP: గుంతకల్లు యూనియన్ బ్యాంక్ బీసీ పాయింట్‌లో శుక్రవారం పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బీసీ పాయింట్‌లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.2 లక్షల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడు సూర్య ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

January 16, 2026 / 06:39 PM IST

వైభవంగా కోదండ రాముని గ్రామోత్సవం

KDP: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సిద్ధవటం మండలం భాకరాపేట కోదండరామని గ్రామోత్సవం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామోత్సవం సందర్భంగా వివిధ వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి.

January 16, 2026 / 06:38 PM IST

నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన యువకులు అరెస్ట్

సత్యసాయి: హిందూపురం వన్ టౌన్ పరిధిలో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ.. కొల్లకుంట సమీపంలో ఎదురుగా వస్తున్న వారిని ఢీకొట్టి ప్రమాదానికి గురిచేశారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ పోలీసులు మీడియాకు తెలిపారు.

January 16, 2026 / 06:37 PM IST

కార్యకర్తలతో కనుమ పండుగ చేసుకొన్న బొత్స

VZM: మేరకుముడిదం మండలం సోమలింగాపురం గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఏపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కనుమ పండుగ చేసుకున్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రజలు అందరకూ మంచి జరగాలని ప్రత్యేక పూజలు చేసినట్లు బొత్స వెల్లడించారు.

January 16, 2026 / 06:35 PM IST

జాకీర్ మృతి దురదృష్టకరం: కాకాణి

NLR: రోడ్డు ప్రమాదంలో జాకీర్ మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జాకీర్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కఠిన సమయంలో కుటుంబానికి, సన్నిహితులకు, స్నేహితులకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.

January 16, 2026 / 06:35 PM IST

తిరుగు ప్రయాణం మొదలు పెట్టిన ప్రజలు

శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ శుక్రవారం జనాలతో కిటకిటలాడింది. సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వచ్చిన ప్రజలు, కనుమ పండుగ సాయంత్రం వారి వారి విధులకు వెళ్లే గ్రామంలో తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. దీంతో రైల్వే స్టేషన్‌లన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతికి రైల్వే స్టేషన్ లన్ని రద్దీ కావడంతో రైల్వే శాఖకు అదరపు ఆదాయం వస్తుందని పలువురు అంటున్నారు.

January 16, 2026 / 06:31 PM IST

గోనెగండ్ల కొండపై ఆంజనేయ స్వామి వేడుకలు

KRNL: గోనెగండ్లలో సంజీవరాయుడు కొండపై సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఈడిగ మునస్వామి గౌడ్ ఆధ్వర్యంలో, గతంలో గాలి వానలకు విరిగిపోయిన ఆంజనేయ స్వామి రూపాన్ని ఈ రోజు కొత్త రేకుతో మళ్లీ తయారు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో వేడుకలను నిర్వహించారు.

January 16, 2026 / 06:30 PM IST

రోడ్డు ప్రమాదం.. శివ మాలదారుడు మృతి

NDL: బేతంచర్ల మండలం సీతారామపురం గ్రామంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం మోటార్ సైకిల్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శంకలాపురం గ్రామానికి చెందిన శివ మాలదారుడు శరవేణి దస్తగిరి కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చిక్సిత పోందుతూ.. మృతి చెందారు. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

January 16, 2026 / 06:26 PM IST

అశ్వ వాహనంపై అన్నవరప్పాడు వెంకన్న ఊరేగింపు

E.G: పెరవలి మండలం అన్నవరప్పాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కనుమ పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం అశ్వ వాహనంపై మాడవీధుల్లో ఊరేగారు. ఉదయం సుప్రభాత సేవతో మొదలైన పూజ కార్యక్రమాలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు పలువురు భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

January 16, 2026 / 06:23 PM IST