SKLM: టీడీపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. జలుమూరు మండలం రామదాసుపేటలో నాయకులు కార్యకర్తలతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవాలని, సంక్షేమ పథకాలు చేరవేయాలని తెలిపారు.