NTR: తిరువూరులో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ రేష్మా బేగం ఆధ్వర్యంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా, డయేరియా నివారణకు పరిశుభ్రత కీలకమని సూచించారు. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, చెట్లు పొదలు శుభ్రం చేయాలని తెలిపారు.