బాపట్ల టౌన్ హాల్లో ‘ఫోరం ఫర్ బెటర్ బాపట్ల’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వీయ జనగణన సహాయక కేంద్రాన్ని శనివారం మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా ప్రజలు తమ కుటుంబ, గృహ వివరాలను వాలంటీర్ల సహాయంతో ఆన్లైన్లో సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సౌకర్యం ఈనెల 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చారు.