VZM: ప్రతి వేతనదారునికి ఏడాదికి 125 రోజుల పని కల్పించడమే లక్ష్యమని బాడంగి MPDO రామకృష్ణ తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో బాడంగిలో ఇవాళ వికసిత్ భారత్ పోస్టర్ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. పని పూర్తయిన 15 రోజుల్లోనే నగదు జమ చేస్తామన్నారు. జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా కార్డు ఇవ్వని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు.