W.G: గ్యాస్, ఆయిల్ నిల్వలు ఉన్నాయంటూ హోటల్స్ కమర్షియల్ గ్యాస్ నిలుపుదల చేయడం విడ్డూరంగా ఉందని సీపీఎం పెంటపాడు మండల కన్వీనర్ సిరపరపు రంగారావు విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా మంగళవారం ప్రజాసంఘాల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. భారతదేశ స్థితిగతులను పరిశీలించి పాలన చేయాలని, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేయరాదన్నారు.