• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మంత్రి నిధులతో భక్తులకు అన్నసంతర్పణ

ELR: నూజివీడు పట్టణంలోని పోతురెడ్డిపల్లి రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో మంత్రి పార్థసారథి సొంత నిధులతో ఇవాళ భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మంత్రి పార్థసారథి జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా, ఆయనను శిరిడి సాయి ఎల్లవేళలా ఆశీర్వదించి, అండగా నిలవాలని కోరారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

April 16, 2026 / 03:04 PM IST

మంగళగిరిలో ‘ప్రజా దర్బార్’

GNTR: మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో పాటు పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ జానీ సైదా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను స్వీకరించారు. సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

April 16, 2026 / 03:01 PM IST

జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

CTR: వీ.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. MPCలో మమత (979), CECలో తస్మియా భాను (967), BiPCలో వనిత (951), నర్సింగ్‌లో మోహర్ (926) ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు జాకీర్, డా. తమీం, అఖిల్ అహ్మద్ తదితరులు విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు.

April 16, 2026 / 03:01 PM IST

పెద్దకడబూరులో గడ్డివాము దగ్ధం

KRNL: పెద్దకడబురుకి చెందిన బొగ్గుల దేవన్న అనే రైతుకు చెందిన సుమారు 4 ఎకరాల వరిగడ్డి ఇవాళ అగ్నికి ఆహుతి అయింది. ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు రైతు వాపోయారు. కళ్లెదుటే మూగజీవాలకు ఆహారంగా నిల్వ ఉంచిన వరిగడ్డి బూడిద కావడంతో రైతు బొరున విలపించాడు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.80 వేల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

April 16, 2026 / 03:00 PM IST

CITU యూనియన్‌లోకి చేరికలు

ATP: గుంతకల్లు పట్టణంలో 60 మంది AITUC ఆటో కార్మికులు గురువారం CITU భగత్ సింగ్ ఆటో యూనియన్‌లోకి చేరారు. వారిని CITU జిల్లా నాయకులు శ్రీనివాసులు, సాకే నాగరాజు కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. కార్మిక చట్టాల అమలు, కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, 8 గంటల పనిదినం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

April 16, 2026 / 03:00 PM IST

‘చేతి పంపును బాగు చేయాలి’

KDP: ఖాజీపేట మండలం అగ్రహారంలో నత్తఢ్ షావల్లి దర్గా వద్ద ఏర్పాటుచేసిన చేతి పంపు చాలా కాలంగా మరమ్మతుకు గురైందని, అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు అన్నారు. వేసవికాలంలో తాత్కాలిక నీటి అవసరాల కోసం చేతి పంపు ఎంతగానో ఉపయోగంగా ఉండేదని స్థానికులన్నారు. RWS అధికారులు ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని చేతిపంపును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

April 16, 2026 / 03:00 PM IST

కలెక్టరేట్‌లో చలివేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

NLR: కలెక్టరేట్ ప్రాంగణంలోని డీఆర్డీఏ కార్యాలయం వద్ద జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించారు. వేసవి ఎండల దృష్ట్యా కలెక్టరేట్‌కు వచ్చే సందర్శకుల కోసం ఈ తాగునీటి సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.

April 16, 2026 / 03:00 PM IST

‘నిరుద్యోగ రహిత రాజమండ్రిని నిర్మించడమే లక్ష్యం’

E.G: నిరుద్యోగ రహిత రాజమండ్రిని నిర్మించడమే తమ లక్ష్యం అని రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ పేర్కొన్నారు. ఏప్రిల్ 18వ తేదీన రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జాబ్ మేళాలో 1000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, బీఫార్మసీ, బీటెక్, ఎంబీఏ, పీజీ చదివినవారు అర్హులన్నారు.

April 16, 2026 / 03:00 PM IST

బాధిత కుటుంబానికి CMRF ఆర్థిక సాయం

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణానికి చెందిన రామలక్ష్మమ్మకు రూ. 3,90,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందజేశారు. BJP నేత హరీష్ బాబు బాధిత కుటుంబ సభ్యులకు ఈ చెక్కును పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించడంలో ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.

April 16, 2026 / 03:00 PM IST

అద్దంకిలో ఘోర రోడ్డు ప్రమాదం

BPT: అద్దంకి మండలం చక్రాయపాలెం నామ్ రహదారిపై గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నరసరావుపేట నుంచి మేదరమెట్ల వైపు వెళ్తున్న కారు, చక్రాయపాలెం మలుపు వద్ద అదుపుతప్పి ఎదురుగా వచ్చిన రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు.

April 16, 2026 / 03:00 PM IST

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇంఛార్జ్‌గా శేఖర్

కోనసీమ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు రామచంద్రపురానికి చెందిన బీజేపీ నాయకుడు సలాది శేఖర్‌ను నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు అందినట్లు శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా సమగ్రమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.

April 16, 2026 / 03:00 PM IST

గిన్నిస్ విజేత అన్మిష్ వర్మను అభినందించిన ఎమ్మెల్యే

W.G: 92 రోజుల్లో 7 అగ్నిపర్వత శిఖరాలను అధిరోహించి గిన్నిస్ రికార్డు సాధించిన అన్మిష్ వర్మను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అభినందించారు. ఆయన సాధించిన ఈ అరుదైన ఘనత యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పట్టుదలతో శ్రమిస్తే అసాధ్యమైనది ఏదీ లేదని ఈ విజయం నిరూపించిందన్నారు. అంతర్జాతీయ పర్వతారోహకుడిగా అన్మిష్ వర్మ మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు.

April 16, 2026 / 03:00 PM IST

భరద్వాజ తీర్థం అడవిలో అగ్ని ప్రమాదం

TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి అనుబంధ భరద్వాజ తీర్థం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగగా దేవస్థానం ఛైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్ తక్షణమే స్పందించారు. ఆయన స్వయంగా రంగంలోకి దిగి దేవస్థానం, అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. ఛైర్మన్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం మంటలను ఆర్పే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

April 16, 2026 / 02:56 PM IST

‘50% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి’

ELR: గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల అభివృద్ధి జరుగుతుందని, భూములిస్తే నేడు అభివృద్ధి ఫలాలు అందకుండా పోతున్నాయని జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తన ఊరి పొలాల్లో వెలసిన టోల్ ప్లాజాలో జరిగే నియామకాల్లో కనీసం 50% ఉద్యోగాలను పుట్లగట్లగూడెం యువకులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టోల్ సూపర్‌వైజర్‌కు వినతి పత్రం అందజేశారు.

April 16, 2026 / 02:47 PM IST

ప్రమాద భరితంగా RTC ప్రయాణం

PLD: మాచవరం మండలంలో RTC ప్రయాణం ప్రమాద భరితంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో వందల సంఖ్యలో మహిళలు బస్సుల్లో కిక్కిరిసిపోతున్నారు. కూర్చునేందుకు సీట్లు కూడా సరిగ్గా లేక ప్లాట్ ఫాంపై నిలబడి మరి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇలాగైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కవ ఉందని, అదనపు బస్సులు వెయ్యాలని ప్రయాణికులు కోరుతున్నారు.

April 16, 2026 / 02:46 PM IST