• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఈ నెల 22న మెగా జాబ్ మేళా

VZM: ఈనెల 22న చీపురుపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎస్‌ఎస్‌సి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన 18-35 ఏళ్ల నిరుద్యోగులు అర్హులని 13 కంపెనీలు పాల్గొంటాయని అధికారులు ఇవాళ తెలిపారు. ఆసక్తిగల వారు రిజిస్ట్రేషన్ చేసి అవసరమైన పత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు.

April 20, 2026 / 03:17 PM IST

దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన కలెక్టర్

PPM: అర్హులైన దివ్యాంగులకు వారి అవసరాల మేరకు ప్రభుత్వం తరపున సహాయక ఉపకరణాలను అందజేస్తున్నామని కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా, పెద గుడబకు చెందిన భాగ్య లక్ష్మికి వీల్ ఛైర్, అలాగే వెంకటరాయుడు పేటకు చెందిన డి. లక్ష్మణరావుకు బ్లైండ్ స్టిక్‌ను కలెక్టర్ పంపిణీ చేశారు.

April 20, 2026 / 03:15 PM IST

‘నేర బాధితులకు అండగా నల్సా స్పృహ’

SKLM: నేర బాధితులు, జైలులో ఉన్న వ్యక్తులపై ఆధారపడిన కుటుంబాలకు సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలవడమే ‘నల్సా స్పృహ-2025’ పథకం లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక న్యాయ సేవా సదన్‌లో న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. సమాజంలో అపవాదు ఎదుర్కొంటున్న ప్రభావిత వర్గాలకు ఈ పథకంతో బహుముఖ మద్దతు లభిస్తుందన్నారు.

April 20, 2026 / 03:15 PM IST

‘మానవాళి మనుగడకే ముప్పు’

ASR: అడవులు తగలబడితే మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని జీకేవీధి మండలం ఆర్వీ నగర్ అటవీ రేంజ్ అధికారి వెంకటరావు అన్నారు. సోమవారం ఆర్వీ నగర్ సంతలో అటవీశాఖ ఆధ్వర్యంలో బీట్ అధికారులతో కలిసి అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అడవులకు వెళ్లేవారు నిప్పులు వేయరాదని సూచించారు.

April 20, 2026 / 03:13 PM IST

విద్యార్థులతో సీఎం బర్త్‌డే వేడుకలు

VSP: సీఎం చంద్రబాబు 76వ జన్మదిన సందర్భంగా పెదగంట్యాడలోని ఓ విద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో చేరిన 100 మంది విద్యార్థులకు ఏడాదికి సరిపడా పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పెంటిరాజు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

April 20, 2026 / 03:12 PM IST

జనగణన పేరుతో సైబర్ మోసాలు: కలెక్టర్

కోనసీమ: జనగణన పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ… జనాభా లెక్కించే సిబ్బంది వివరాలు, ఫోన్ నంబర్లు మాత్రమే సేకరిస్తారని, ఓటీపీలు అడగరని తెలిపారు. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పవద్దని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల అవగాహన కలిగి ఉండాలన్నారు.

April 20, 2026 / 03:10 PM IST

IPL బెట్టింగ్‌లపై ఎస్సై హెచ్చరికలు

బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో IPL బెట్టింగ్‌లపై ఎస్సై తిరుపతిరావు హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బెట్టింగ్ ఆడేవారు, నిర్వహించే వారిపై ఏపీ గేమింగ్ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అసాంఘిక కార్యక్రమాలుపై చర్యలు తప్పవని చెప్పుకొచ్చారు.

April 20, 2026 / 03:08 PM IST

వీరనాయకుని పాలెంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

GNTR: చేబ్రోలు (మం) వీరనాయకుని పాలెంలో రూ.19.60 లక్షల ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌, ఎంపీజీఎఫ్‌ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ కార్యాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.

April 20, 2026 / 03:03 PM IST

‘చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలి’

ELR: చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేయడం తగదని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం చింతలపూడి మండలం ప్రగడవరంలో రైతులకు సమావేశం నిర్వహించారు. మెట్ట ప్రాంతానికి ఉపయోగపడే ఈ పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం బాధాకరమని ప్రభుత్వం వెంటనే దీనిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

April 20, 2026 / 03:03 PM IST

పేదలకు అన్నం వడ్డిస్తున్న ఎమ్మెల్యే భాష్యం

PLD: అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నూతనంగా ప్రారంభమైన అమరావతి అన్న క్యాంటీన్‌లో సోమవారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేదలకు అన్నం వడ్డించారు. నిరుపేదలకు ఐదు రూపాయలకే నాణ్యమైన అన్నం అందేలా అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. పేద బడుగు బలహీనవర్గాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

April 20, 2026 / 03:03 PM IST

‘ఫెర్టిగేషన్ – ఆటోమేషన్’ అవగాహన పోస్టర్‌ ఆవిష్కరణ

సత్యసాయి: ఉద్యాన పంటలను లాభసాటిగా మార్చేందుకు రూపొందించిన ‘ఫెర్టిగేషన్ – ఆటోమేషన్’ అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కలిసి ఆవిష్కరించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బిందు సేద్యం ద్వారా నీరు, ఎరువులను నేరుగా మొక్క మొదళ్లకే అందించే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.

April 20, 2026 / 03:00 PM IST

గోశాలకు 200 గడ్డి కట్టలు అందజేత

E.G: కడియం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వరస్వామి గోశాలకు కడియం గ్రామ మాజీ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ దాత ఉప్పులూరి హనుమంతరావు వట్టి గడ్డి కట్టలు సోమవారం అందజేశారు. కుమారుడు తాతాజీ ద్వారా గోశాల సంరక్షణ సమితి అధ్యక్షులు గిరజాల బాబు చేతుల మీదుగా సుమారు రూ.15 వేలు విలువ చేసే 200 గడ్డి కట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వంగపండు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

April 20, 2026 / 03:00 PM IST

అన్న క్యాంటీన్‌లో భోజనం వడ్డించిన ఎమ్మెల్యే

ATP: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను గుంతకల్లు పట్టణంలోని అన్న క్యాంటీన్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కేక్‌ను కట్ చేశారు. అనంతరం అన్న క్యాంటీన్‌కి వచ్చిన ప్రజలకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

April 20, 2026 / 03:00 PM IST

‘పిల్లలకు జంక్ ఫుడ్స్‌ను దూరంగా ఉంచండి’

NLR: అల్లూరు పట్టణంలోని అరుంధతీయవాడ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు సోమవారం నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ… జంక్ ఫుడ్స్ తినకూడదన్నారు. మంచి పోషక విలువల కలిగిన ఆకుకూరలు, కాయగూరలు తినాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

April 20, 2026 / 03:00 PM IST

నూతన లైబ్రరీని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ

KKD: ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) పథకం కింద 23.10 లక్షల రూపాయల నిధులతో నూతనంగా లైబ్రరీని నిర్మించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ సోమవారం ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన చదువు వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లు ఆమె తెలిపారు.

April 20, 2026 / 03:00 PM IST