అన్నమయ్య: రాజంపేట(M) పులపుత్తూరులో దంపెట్ల మల్లిఖార్జున (40) అనే వ్యక్తి బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామం మధ్యలో బండరాయితో దాడి చేయడంతో తల వెనుక తీవ్ర గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఖాళీగా ఉన్న స్టాళ్లు, దుకాణాల కేటాయింపునకు APSRTC బహిరంగ టెండర్లు ఆహ్వానిస్తోంది. నిరుద్యోగులు, వ్యాపారులు సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు ఇది మంచి అవకాశం. టీ స్టాళ్లు, జనరల్ స్టోర్స్, బుక్ స్టాల్స్ వంటి వాటికి ఇక్కడ ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి గలవారు ధర్మవరం డిపో మేనేజర్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
కోనసీమ: ఆలమూరు మండలంలో నున్న పెదపళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా ఎం.సుదీప్తి గురువారం నియమితులయ్యారు. పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ విభాగంలో సూపర్ స్పెషాలిటీ డిగ్రీ ఆమె ఇటీవల పూర్తి చేసుకున్నారు. వైద్యుల నియామకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుదీప్తిని స్థానిక వైద్యాధికారిగా నియమించింది. దీంతో ఆస్పత్రికి ఇద్దరు వైద్యుల భర్తీ జరిగినట్లయ్యింది.
నెల్లూరు జిల్లా నవాబుపేటలో ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి, పలువురికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె హెచ్చరించారు.
KDP: నగరంలో తాగునీటి సరఫరా సక్రమంగా కొనసాగేందుకు గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ రామన్నపల్లి, వాటర్ గంటి పంపింగ్ హౌస్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంపింగ్ కేంద్రాల్లో నిర్వహణ పనులు, యంత్రాల పనితీరును కమిషనర్ సమీక్షించారు.
ELR: జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. స్థానిక కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతున్న దేవలపల్లి వేద్య, దేవులపల్లి విద్య మంచి మార్కులు సాధించారు. వేద్య (అక్క) 444, విద్యకు (చెల్లి)కి 440 మార్కులు వచ్చాయి. ఈ సందర్భంగా వారిని స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు.
కడపలో అనారోగ్యంతో మృతిచెందిన హోమ్ గార్డు ఎం. రమణమూర్తి కుమారుడు ఎం. అభిషేక్‌కు కారుణ్య నియామకం కింద హోమ్ గార్డు ఉద్యోగ నియామక పత్రాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులను పరామర్శించి, పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.
అన్నమయ్య: గోరాన్ చెరువు గ్రామం నల్లగుట్టలోని అసర్ల గంగమ్మ తల్లి ఆలయంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జగన్ హయాంలో ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిన విషయాన్ని వివరించారు.
GNTR: తెనాలి పట్టణ మాజీ కౌన్సిలర్ సూర్యదేవర సాంబశివరావు 19వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక చిహ్నం వద్ద SSSR అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సేవలను గుర్తుచేసుకుంటూ, సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. పలువురు నాయకులు, అభిమానులు పాల్గొని ఆయన ఆదర్శాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
BPT: రేపల్లె పట్టణ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా (CI) బి.అశోక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన గత సీఐ బదిలీ కావడంతో, ఆయన స్థానంలో అశోక్ నియమితులయ్యారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని ఆయన పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
TPT: సత్యవేడు మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు చమర్తి కండ్రిగలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం 10.30 గంటలకు సత్యవేడు వెలుగు కార్యాలయంలో సంఘమిత్రులకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరుకావాలని కోరారు.
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం వాసి కర్నాటి గురువారెడ్డి బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి కంభం ఆసుపత్రికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బెస్తవారిపేట ఎంపీపీ ఓసూర రెడ్డి, మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
W.G: భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో నిత్యాన్నదాన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవనం పూర్తయితే రోజుకు సుమారు 2 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ నాగభూషణం, అసిస్టెంట్ కమిషనర్ నగేష్, తదితరులు పాల్గొన్నారు.
NDL: టీడీపీ కమిటీలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబుకు గురువారం ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకటరామరాజు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన కలపటపు బుచ్చి రాంప్రసాద్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా నియమితులైన విజయకుమార్, జ్యోత్స్న, రాష్ట్ర కార్యదర్శి లోహిత్ నియామకం హర్షణీయమన్నారు.
సత్యసాయి: కదిరి మహిళ, స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్ పర్వీన్ భాను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు పర్వీన్ భాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.