• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డీ. పోలవరంలో పోలీసులు పల్లె నిద్ర

KKD: తుని మండలం డీ. పోలవరంలో సీఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు పెంచేందుకే ఈ కార్యక్రమని ఆయన పేర్కొన్నారు.

April 14, 2026 / 07:24 AM IST

ఈ నెల 21న ఎమ్మిగనూరులో మెగా జాబ్ మేళా

KRNL: యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని సోమవారం జిల్లా కలెక్టర్ డా.సిరి సూచించారు. ఏప్రిల్ 21న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9:30 నుంచి ఈ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రైవేట్ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు పాల్గొనాలని సూచించారు.

April 14, 2026 / 07:24 AM IST

ప్రమాదం.. గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ

ప్రకాశం: దొనకొండ మండలం మల్లంపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 544పై సోమవారం రాత్రి మాడమంచు ముసలయ్య గొర్రెల మందపైకి గుర్తుతెలియని లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 3 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. చింతకుంట్ల నుంచి తిరుప్పాయిపాలెం వైపు వెళ్తుండగా కోల్డ్ స్టోరేజ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

April 14, 2026 / 07:20 AM IST

రేపు ఏయూలో జాబ్ మేళా

VSP: ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఈనెల 15న మోడల్ కెరీర్ సెంటర్, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మేళా జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హత పత్రాల నకళ్లతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సంస్థ డిప్యూటీ చీఫ్ దొరబాబు సూచించారు.

April 14, 2026 / 07:18 AM IST

నేడు అంబేడ్కర్ జయంతి వేడుకలలో పాల్గొననున్ మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలోని అవుకు మెట్ట వద్ద ఇవాళ ఉదయం 8 గంటలకు నిర్వహించనున్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా NDA కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి క్యాంప్ కార్యాలయం పిలుపునిచ్చింది.

April 14, 2026 / 07:18 AM IST

వాడపల్లి ఈవో సూర్య చక్రధరరావుకు అదనపు బాధ్యతలు

కోనసీమ: వాడపల్లి వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా విధులు నిర్వహిస్తున్న సూర్యచక్రధరరావుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఇన్‌ఛార్జ్ ఈవోగా సోమవారం ఆయనను నియమిస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి నుంచి ఆయన వాడపల్లితో పాటు అన్నవరం దేవస్థాన ఈవోగా బాధ్యతలను పర్యవేక్షించనున్నారు.

April 14, 2026 / 07:17 AM IST

MLAను మర్యాద పూర్వకంగా కలసిన డీఎస్పీ

VZM: బొబ్బిలి DSP గా గోవిందరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ DSPగా పని చేసిన భవ్యరెడ్డిను సరెండర్‌ చేసిన నేపథ్యంలో VZM DSP గా పనిచేస్తున్న ఆయనను బొబ్బిలి బదిలీ చేయడంతో బాధ్యతలు స్వీకరించి బొబ్బిలి కోటలో స్దానిక MLA బేబినాయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సబ్‌ డివిజన్లో గంజాయి, సైబర్‌ నేరాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.

April 14, 2026 / 07:14 AM IST

భూగర్భ జల మట్టాలను పెంచడమే లక్ష్యం

ASR: జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంచడం, చెరువులు, జలాశయాలను పునరుద్ధరించడం లక్ష్యంగా “జలధార-జలహారతి” కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ నిషాంతి సోమవారం అధికారులను ఆదేశించారు.100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో, ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో సాగునీటి వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. నీటి వనరులకు సాంకేతికత అనుసంధానించి నీటి వనరులు పునరుద్ధరించాలన్నారు.

April 14, 2026 / 07:13 AM IST

అత్యాచార నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష

KDP: 2021లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కమలాపురం(M)మీరాపురంకి చెందిన కిరణ్ కుమార్ అనే నిందితుడికి కడప జిల్లా పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. సమర్పించిన సాక్ష్యాలు, దర్యాప్తు అధికారుల నివేదికలను పరిశీలించిన కోర్టు నేరం రుజువైనట్లు నిర్ధారించిందని కడప జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ మీడియాకు తెలిపారు.

April 14, 2026 / 07:10 AM IST

చిత్తూరు ఎంపీ పర్యటన వివరాలు

CTR: చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఇవాళ ఉదయం 10 గంటలకు జిల్లా టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని నాయకులు తెలిపారు. అనంతరం పలు ప్రాంతాలలో నిర్వహించి డా.బీ.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి కార్యక్రమాలలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 14, 2026 / 07:06 AM IST

రేపు జిల్లాలో పలు క్రీడా ప్రాజెక్టులు ప్రారంభించనున్న మంత్రి

TPT: తిరుపతిలో రేపు మంత్రి నారా లోకేష్ పలు క్రీడా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ. 10.20 కోట్లతో నిర్మించిన NTR క్రీడా ప్రాంగణం ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, ఇతర క్రీడా సదుపాయాల పనులు కూడా చివరి స్థాయికి చేరుకున్నాయి. మొత్తం 28.30 ఎకరాల్లో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నారు.

April 14, 2026 / 07:04 AM IST

నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

అనకాపల్లి జిల్లాలో నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేటనిషేధం అమలులోకి రానుంది. జూన్ 14 వరకు వేట నిషేధం కొనసాగుతుంది. సముద్రంలో చేపల సంతాన ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ప్రతి ఏట మే 14 నుంచి జూన్ 15 వరకు ప్రభుత్వం వేట నిషేధాన్ని అమలు చేస్తుంది. జిల్లాలో 31 మత్స్యకార గ్రామాల్లో 12,644 మంది మత్స్యకారులకు ప్రభుత్వం వేట నిషేధ సమయంలో భృతిని అందజేస్తుంది.

April 14, 2026 / 07:04 AM IST

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను వేగవంతం చేయాలి: కలెక్టర్

NDL: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంశాల్లో పెండింగ్ ఉన్న అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని సోమవారం సంబంధిత అధికారులను కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాలులో స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 5 నుంచి 15 ఏళ్ల లోపు వయస్సు ఉన్న సుమారు 56,000 విద్యార్థుల బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలన్నారు.

April 14, 2026 / 07:02 AM IST

‘ఈ నెల 20, 21 న జరిగే మహాసభలు జయప్రదం చేయాలి’

VZM: ఈ నెల 20, 21 తేదీలలో పట్టణంలో జరగనున్న AITUC జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ మునకాల శ్రీనివాస్‌ కోరారు. ఈ సందర్భంగా సోమవారం బొబ్బిలిలో మహాసభలన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని, వారికి నష్టం చేసి లేబర్‌ కోడ్‌ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

April 14, 2026 / 07:00 AM IST

వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : చమర్తి

అన్నమయ్య: గత YCP ప్రభుత్వ కాలంలో జరిగిన భూ అక్రమాలు, అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని TDP నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. సోమవారం రాజంపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకుల అక్రమాలను ప్రజలకు వివరించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని సూచించారు.

April 14, 2026 / 07:00 AM IST