NDL: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంశాల్లో పెండింగ్ ఉన్న అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని సోమవారం సంబంధిత అధికారులను కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాలులో స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 5 నుంచి 15 ఏళ్ల లోపు వయస్సు ఉన్న సుమారు 56,000 విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ చేయాలన్నారు.