కోనసీమ: వాడపల్లి వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా విధులు నిర్వహిస్తున్న సూర్యచక్రధరరావుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవోగా సోమవారం ఆయనను నియమిస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి నుంచి ఆయన వాడపల్లితో పాటు అన్నవరం దేవస్థాన ఈవోగా బాధ్యతలను పర్యవేక్షించనున్నారు.