BHNG: భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బాలరాజు బుధవారం సాయంత్రం తాటి చెట్టుపై నుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. కల్లు సేకరించేందుకు చెట్టు పైకి ఎక్కిన బాలరాజు ప్రమాదవశాత్తు జారి చెట్టుపై నుంచి కింద పడ్డాడు. బాలరాజుకు భువనగిరి జీజీహెచ్లో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం తదుపరి చికిత్స నిమిత్తం మెరుగైన వైద్యం కోసం HYD కు తరలించారు.