NLR: కలెక్టరేట్ ప్రాంగణంలోని డీఆర్డీఏ కార్యాలయం వద్ద జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించారు. వేసవి ఎండల దృష్ట్యా కలెక్టరేట్‌కు వచ్చే సందర్శకుల కోసం ఈ తాగునీటి సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.