ASF: పెంచికల్ పేట్ మండలంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో MLC దండే విఠల్ పాల్గొన్నారు. MLC మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రణాళిక ద్వారా గ్రామాలలో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డేవిడ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.