MDK: రోడ్డు భద్రత నియమాలను పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని CI రేణుకా రెడ్డి అన్నారు. 99 రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్-అలైవ్ కార్యక్రమాన్ని అల్లాదుర్గంలోని వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసి వాహనాదారులకు, అధికారులకు అవగాహన నిర్వహించారు. విధిగా ప్రతి ఒక్కరూ వాహనదారులు హెల్మెట్, సీటు బెల్టు ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలన్నారు.