CTR: వీ.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. MPCలో మమత (979), CECలో తస్మియా భాను (967), BiPCలో వనిత (951), నర్సింగ్‌లో మోహర్ (926) ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు జాకీర్, డా. తమీం, అఖిల్ అహ్మద్ తదితరులు విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు.