కోనసీమ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు రామచంద్రపురానికి చెందిన బీజేపీ నాయకుడు సలాది శేఖర్‌ను నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు అందినట్లు శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా సమగ్రమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.