USAలో తెలుగోడి సాహసం.. దోపిడీని అడ్డుకుని కాల్పుల్లో విద్యార్థి మృతి
ప్రస్తుతం తల్లి ఒంటరిగా ఏలూరులో నివసిస్తోంది. ప్రస్తుతం చివరి సెమిస్టర్ చదువుతున్నాడు. 10 రోజుల్లో మాస్టర్స్ పూర్తయి స్వదేశానికి రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి సమయంలో ఈ ఘోరం జరగడంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి లోనైంది.
అమెరికాలో తుపాకీ సంస్కృతికి (Gun Culture) మన తెలుగు కుర్రాడు బలయ్యాడు. దోపిడీకి వచ్చిన దుండగులను సాహసంతో వారిని అడ్డగించాడు. అయితే దుండగుడి కాల్పులు మనోడి శరీరంలోకి దూసుకెళ్లాయి. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన అమెరికాలోని (USA) వెస్ట్ కొలంబస్ (West Columbus)లో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఏపీలోని ఏలూరులో విషాదం ఏర్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) పాలకొల్లుకు (Palakollu) చెందిన వీర సాయిష్ (24) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని (Ohio State) వెస్ట్ కొలంబస్ (West Columbus)లో ఉన్న స్టేట్ పిన్స్ యూనివర్సీటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. చదువుతోనూ కొలంబస్ ఫ్రాంక్లింటన్ (Franklinton)లోని ఓ షెల్ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి 12.50 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) గ్యాస్ స్టేషన్ లో కొందరు దుండగుడు దోపిడీ కోసం వచ్చాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సాయిష్ వాటిని అడ్డుకున్నాడు. ఫలితంగా దుండగుడు జరిపిన కాల్పుల్లో (Fire) సాయిష్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే స్పందించిన స్టేషన్ సిబ్బంది ఓహియో హెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్ (Medical Centre)కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మనోడు మరణించాడు. కాగా పోలీసులు అనుమానుతుడి ఫొటోను విడుదల చేశారు.
కాగా తండ్రి మరణించడంతో కుటుంబాన్ని పోషించేందుకు సాయిష్ రెండేళ్ల కిందట అమెరికాకు వచ్చాడు. ప్రస్తుతం తల్లి ఒంటరిగా ఏలూరులో (Eluru) నివసిస్తోంది. ప్రస్తుతం చివరి సెమిస్టర్ చదువుతున్నాడు. 10 రోజుల్లో మాస్టర్స్ పూర్తయి స్వదేశానికి రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి సమయంలో ఈ ఘోరం జరగడంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి లోనైంది. ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. కాగా, మృతదేహం భారత్ కు రెండు, మూడు రోజుల్లో స్వస్థలం రానుంది. కాగా పేదింటి కుటుంబం కావడంతో సాయేష్ మిత్రులు విరాళాలు సేకరిస్తున్నారు. ‘గో ఫండ్ మీ’లో (Go Fund Me) విరాళాల కోసం అభ్యర్థిస్తున్నారు. సహాయం చేయాలనుకునే వారు ఇక్కడ క్లిక్ చేయండి.