Tamilsai Sounder Rajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Governor Tamilisai) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. దీనితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. ప్రత్యక్షరాజకీయాల్లో అడుగుపెట్టాలనే ఉద్యేశంతోనే తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. గతంలో కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ అనుమతి ఇస్తే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని అన్నారు. అయితే తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం. చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకూడి నుంచి బీజేపీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. తమిళసై గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు.
2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై ఛార్జ్ తీసుకున్నారు. తెలంగాణలో తొలి మహిళా గవర్నర్‌గా నిలిచారు. తరువాత పుదుచ్చేరి ఇంచార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. తమిళిసై సౌందర రాజన్ 20 ఏళ్లుగా బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసిన అనుభవం ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు. ప్రస్తుతం గవర్నర్ రాజీనామాతో తెలంగాణ గవర్నర్‌గా ఎవరు నియమితులు అవుతారు అనేది ఆసక్తిగా మారింది.