Pawan Kalyan : అసెంబ్లీలో టీడీపీ నేతలపై దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం సభలో జీవో నెంబర్ 1పై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. అయితే టీడీపీ సభ్యుల తీరుపై వైస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు కూడా పోడియం వద్దకు వెళ్లారు.
అసెంబ్లీలో టీడీపీ నేతలపై దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం సభలో జీవో నెంబర్ 1పై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. అయితే టీడీపీ సభ్యుల తీరుపై వైస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు కూడా పోడియం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో వైస్సార్సీపీ నేతలు , టీడీపీ నేతలపై దాడి చేసారు. ఏ దాడిని ప్రతిపక్ష పార్టీలు , సీనియర్ నేతలంతా ఖండిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు , సిపిఐ నారాయణ తదితరులు స్పందించగా…తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఘటన ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఏపీ అసెంబ్లీకి సంబంధించి మీడియా ద్వారా అందిన సమాచారం చూస్తే… ఈ పరిణామాలు దురదృష్టకరమైనవని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేవని పేర్కొన్నారు. ప్రజల గొంతు నొక్కే జీవో నెం.1పై చర్చను కోరిన విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలపై అధికార పక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఆక్షేపించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
అర్థవంతమైన చర్చలకు ఉద్దేశించిన వేదికలు చట్టసభలు అని, చర్చ కోసం పట్టుబడితే దాడి చేయడం భావ్యం కాదని హితవు పలికారు. ఇదే పరిస్థితి కొనసాగితే, ఈ విధమైన దాడులు చట్టసభల నుంచి వీధుల్లోకి వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయని పేర్కొన్నారు. ముందుగా చట్టసభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపైనా, సభ ప్రిసైడింగ్ అధికారులపైనా ఉందని పవన్ స్పష్టం చేశారు.