'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా లాగే 'ది కేరళ స్టోరీ(The Kerala Story)' సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా బక్సాఫీస్ దగ్గర దూసుకుపోతునే ఉంది. ఇలాంటి సమయంలో ఈ సినిమా డైరెక్ట్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
అసలు ఈ మధ్య కాలంలో కేరళ స్టోరీ(The Kerala Story) సినిమాపై జరిగినంత వివాదం.. మరో సినిమాకు జరగలేదనే చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ మొదలుకొని థియేటర్లోకి వచ్చే వరకు.. రిలీజ్‌ను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ సినిమా పై పెద్ద రాజకీయమే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోను కేరళ స్టోరీని థియేర్లోకి తీసుకు రావద్దని నిరసనలు చేశాయి లోకల్ రాజకీయ పార్టీలు. కానీ ఎన్నో అవాంతరాలను అధిగమించి.. ఎట్టకేలకు మే 5న ‘ది కేరళ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాకు జరిగిన కాంట్రవర్శీ వల్ల భారీ పబ్లిసిటీ వచ్చింది. దాంతో భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.213 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఒక ఫిమేల్ లీడ్ సినిమాకు ఇంత భారీ వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచాయి. ఈ సినిమాలో అదా శర్మ(adah sharma) కీ రోల్ ప్లే చేసింది. కేరళలో 32 వేల మంది యువతులు, మహిళలు అదృశ్యమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలతోనే సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాను సుదీప్తో సేన్ డైరెక్ట్ చేశాడు. తాజాగా ఈ సెన్సేషన్ డైరెక్టర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విరామం లేకుండా ప్రయాణాలు చేయడం వల్లే అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రి(hospitalised)లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన హెల్త్ కండీషన్ ఎలా ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది.