NLG: సామాన్యులకు అందాల్సిన సబ్సిడీ గ్యాస్‌ను వ్యాపార అవసరాలకు వాడుతున్న వారిపై పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రెండ్రోజులుగా నల్గొండ, మిర్యాలగూడ, కొండమల్లెపల్లి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి హోటళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 100కు పైగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వినియోగించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.