ATP: తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ వ్యక్తిని నోటితో కొరికి గాయపరిచిన వింతైన ఘటన బొమ్మనహాళ్ మండలంలో చోటుచేసుకుంది. శ్రీధర్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం రాజన్న వద్ద రూ. 5000 అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీధర్.. రాజన్న చెంపపై నోటితో తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.