Batti Vikramarka : రాహుల్ ని ప్రధాని చేయడం వైఎస్ చివరి కోరిక..
Batti Vikramarka : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ ని ప్రధాని చేయడం అంటూ.... కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గాంధీ భవన్లో ఈరోజు జరిగిన హాత్ సే హాత్ జోడో సమీక్ష సమావేశం లో మాట్లాడిన ఆయన పలు విషయాలను తెలియజేశారు. కేంద్రంలోని బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలపై విమర్శల వర్షం కురిపించిన ఆయన... వైఎస్సార్ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ ని ప్రధాని చేయడం అంటూ…. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గాంధీ భవన్లో ఈరోజు జరిగిన హాత్ సే హాత్ జోడో సమీక్ష సమావేశం లో మాట్లాడిన ఆయన పలు విషయాలను తెలియజేశారు. కేంద్రంలోని బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలపై విమర్శల వర్షం కురిపించిన ఆయన… వైఎస్సార్ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు.
బీఆర్ఎస్ ప్రమాదకరంగా మారిందని అన్నారు. కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు తిన్నారని.. ప్రాజెక్టు నుంచి చుక్క నీరు పారలేదని వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుకు కాల్వలు తవ్వకుండా నీళ్లు ఎట్ల ఇస్తరని ప్రశ్నించారు. కృష్ణా నదిపై పాలమూరు తప్ప కొత్త ప్రాజెక్టేది అని నిలదీశారు. అన్నీ కూడా కాంగ్రెస్ కట్టినవే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ సృష్టించిన సంపదతోనే హైదరాబాద్ లో భూముల రేట్లు పెరిగాయని.. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మేస్తోందన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని.. కానీ కాంగ్రెస్ కట్టిన కరెంట్ ప్రాజెక్టులతోనే సాధ్యమవుతోందని తెలిపారు. బీఆర్ఎస్ కట్టిన కొత్త ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. దేశాన్ని బీజేపీ మత ప్రాతిపదికన విడదీస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మేస్తోందని విమర్శించారు.
ఇక…కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. 2009లో రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతండగా.. సభ మధ్యలోనే ఇక్కడ భేటీ జరిగిందని చెప్పారు. ఆ సమయంలో తన చివరి కోరిక ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం అని రాజశేఖరరెడ్డి చెప్పారని తెలిపారు. ఆ దిశలో సిద్దం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు రాజశేఖరెడ్డి కూడా పిలుపిచ్చారని చెప్పారు.