Congress defeated in Telangana elections 2023 Victory in Aswaraopeta and yellandu
జగన్నాథ స్వామి ఉల్టా రథయాత్ర(Ulta Rath Yatra)లో అపశ్రుతి జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు దుర్మరణం (7 died) చెందారు. మృతులంతా విద్యుత్ షాక్(Electric shock)తో ప్రాణాలు విడిచారు. ఈ దారుణ ఘటన త్రిపుర(Tripura)లోని ఉనాకోటి జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. కుమార్ఘాట్లో సాయంత్రం జగన్నాథుడి ‘ఉల్టా రథయాత్ర’ సాగింది. ఈ రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు.
పెద్ద సంఖ్యలో జనం గుమికూడి ఇనుముతో చేసిన రథాన్ని(Ulta Rath Yatra) లాగుతున్న సమయంలో హైటెన్షన్ వైర్లను రథం తాకింది. దీంతో విద్యుత్ షాక్(Electric shock)తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం మానిక్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.