AP: పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలోని 21 జిల్లాలకు 1,162.80 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ పంప్ సెట్లను కేంద్రం మంజూరు చేసింది. వీటిని గ్రిడ్‌కు అనుసంధానించడం ద్వారా రైతులకు మేలు కలగనుంది. జిల్లా వారీగా చూస్తే చిత్తూరుకు అత్యధికంగా 221 మెగావాట్ల సామర్థ్యం కేటాయించగా, తూర్పుగోదావరి జిల్లాకు అత్యల్పంగా 9.33 మెగావాట్లు దక్కాయి.