WGL: వర్ధన్నపేట పట్టణంలో బీజేపీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్ ముగింపు సమావేశానికి బుధవారం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఎదుగుదల, నాయకుల కృషిపై మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి విజయం సాధించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.