తెలంగాణలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాన రాజకీయ నేతలంతా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు షెడ్యూల్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారు.
నటి జ్యోతిక తన భర్త సూర్య గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తమ ప్రేమ గురించి చెబుతూ.. ప్రేమలో పడటం ఈజీనే కానీ.. ఎదగడం నేర్చుకోవాలని అంటుంది.
ఓ విద్యార్థిని ప్రేమిస్తున్నానని టీచర్ మోసం చేశాడు. ఇంటికి తీసుకెళ్లి తాళి కట్టాడు. పెళ్లి అయ్యింది కదా అని.. ఆపై లైంగికదాడి చేశాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నల్ లోపంతో మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. ఒడిశాలోని సుందర్‌గడ్ జిల్లా రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో రెండు ప్యాసింజర్ రైళ్లు పట్టాలు తప్పాయి.
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి మంగళవారం ఒక ఉపాధ్యాయుడు గుంజీలు చేయమని బలవంతం చేయడంతో క్లాసు రూంలోనే కుప్పకూలాడు.