Sreeshanth: టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. స్పోర్ట్స్ అకాడమీ కట్టిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడని అతడిపై చీటింగ్ కేసు నమోదైంది. కన్నాపూర్‌కు చెందిన బాలగోపాల్ ఫిర్యాదు మేరకు కన్నూరు పోలీసులు శ్రీశాంత్(Sreeshanth)తో పాటు మరో ఇద్దరిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అసలు వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 25, 2019 నుంచి వేర్వేరు తేదీల్లో ఇద్దరు నిందితులు రాజీవ్ కుమార్, వెంకటేష్ రూ. 18.70 లక్షలు తీసుకున్నట్లు బాలగోపాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అకాడమీలో భాగస్వామి అయ్యే అవకాశం వచ్చినప్పుడే ఆ డబ్బును పెట్టుబడి పెట్టానని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
చివరకు ఆ మాట మీద నిలబడకపోవడంతో ఆ స్థలంలో మరో నిర్మాణం చేపట్టారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కన్నూర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్లో ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కన్నూరు పోలీసులు క్రికెటర్ శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో శ్రీశాంత్‌ను మూడో నిందితుడిగా చేర్చిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు.