Sakshi's Expression Viral In Pic With MS Dhoni And Suresh Raina
Sakshi: ప్రపంచకప్ ముగిసింది. ఇందులో ధోనీ ఆడి ఉంటే బాగుండు అని ఫ్యాన్స్ కోరుకున్నారు. ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ సమయంలో ICC, BCCI మునుపటి ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్లందరినీ ఆహ్వానించినట్లు నివేదికలు వచ్చాయి. ధోనీ ఎక్కడా కనిపించలేదు. అతని భార్య సాక్షి సింగ్ ధోనీ (Sakshi) ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలోతమ పూర్వీకుల గ్రామాన్ని సందర్శించారు.
ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ధోని తన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సహచరుడు సురేష్ రైనాని కలిశాడు. రైనాకు విందు కోసం ఆతిథ్యం ఇచ్చారు. ఎప్పటిలాగే అద్భుతమైన హోస్ట్‌లుగా ఉన్నందుకు మాజీ భారత బ్యాటర్ ఈ జంటకు ధన్యవాదాలు తెలిపారు. మంచి డిన్నర్ అందించిందుకు థ్యాంక్స్ అంటూ రైనా పోస్టు చేశారు. ఈ పోస్టుతోపాటు రైనా ఓ ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటోలో సాక్షి (Sakshi) ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ వింత ఎక్స్ ప్రెషన్స్ చాలా ఫన్నీగా ఉండటతో అందరినీ ఆకట్టుకున్నాయి.
భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను కూడా ధోనీ విందుకు ఆహ్వానించాడు. భారత మాజీ కెప్టెన్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అల్మోరాలో ల్వాలీలో ధోనీ భార్య సాక్షి పోజులిచ్చిన చిత్రాన్ని పంచుకున్నారు. దిగ్గజ భారత కెప్టెన్‌ను చూసేందుకు అభిమానులు థ్రిల్‌గా ఉండగా, ధోని, అతని భార్య స్థానికులతో సంభాషించడాన్ని చూడగలిగే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, ధోనీ, సాక్షి పెద్దల పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవడం చూడవచ్చు. గతవారం జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.