Jyothika: ప్రేమలో పడటం ఈజీ కానీ.. సూర్య ఎలాంటివాడంటే?
నటి జ్యోతిక తన భర్త సూర్య గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తమ ప్రేమ గురించి చెబుతూ.. ప్రేమలో పడటం ఈజీనే కానీ.. ఎదగడం నేర్చుకోవాలని అంటుంది.
Jyothika: తమిళ హీరో సూర్య(Surya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నటనతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. అతని భార్య జ్యోతిక (Jyothika) అందరికి పరిచయమే. ప్రస్తుతం వీరు అన్యోన్యంగా ఉన్నారు. సూర్య వరసగా సినిమాలు చేస్తున్నారు. జ్యోతిక కూడా ఆడపా దడపా సినిమాల్లో నటిస్తుంది. వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే.
ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక.. తన హస్బెండ్ గురించి, లవ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ప్రేమలో పడటం ఈజీ అని.. ప్రేమలో ఎదగడం ముఖ్యమని తెలిపారు. ఇక పెళ్లి అయిన తరువాత దాంపత్య జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైందని పేర్కొన్నారు. జీవిత భాగస్వామిని గౌరవించడం, అభినందించడం ఎంతో ప్రధానం అన్నారు. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం మంచిది కాదని చెప్పారు. అలా అయితేనే రోజులు గడిచే కొద్ది ప్రేమ పెరుగుతుందని అన్నారు. హీరో సూర్యతో కలిసి 7 చిత్రాల్లో నటించానని తెలిపారు. ఆయన అందరినీ ఎంతో గౌరవిస్తారని, తన ఆలోచనలకు కూడా ఎంతో విలువ ఇస్తారని వెల్లడించారు. అందుకే తనపై ఉన్న ప్రేమను చెప్పగానే వెంటనే ఓకే చేశానని, సూర్యను పెళ్లి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని జ్యోతిక తెలిపారు.