PDPL: పేదలకు అండగా ప్రభుత్వం పని చేస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నెర వేరుస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉగాది నుంచి పేదలకు సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని అన్నారు. రామగుండం ప్రాంతంలో ఉన్న నిరుపేదల కోసం ఎమ్మెల్యే పనిచేస్తున్నాన్నారు.