AKP: పరవాడ మండలం లంకెలపాలెంలో కాలుష్యాన్ని నివారించకపోతే పోరాటం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామస్తులు ఆదివారం లంకెలపాలెంలో సమావేశం అయ్యారు. గ్రామం మీదుగా తిరుగుతున్న బొగ్గు, బూడిద లారీలతో గ్రామం అంతా కలుషితం అవుతుందన్నారు. దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలిపారు. పలుసార్లు అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా స్పందన లేదన్నారు.