»Odisha School Student Death Teacher Forced Sit Ups Innocent Child Lost His Life
Odisha: గుంజీలు తీస్తూ క్లాస్ రూంలోనే కుప్ప కూలి చనిపోయిన విద్యార్థి
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి మంగళవారం ఒక ఉపాధ్యాయుడు గుంజీలు చేయమని బలవంతం చేయడంతో క్లాసు రూంలోనే కుప్పకూలాడు.
Odisha: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి మంగళవారం ఒక ఉపాధ్యాయుడు గుంజీలు చేయమని బలవంతం చేయడంతో క్లాసు రూంలోనే కుప్పకూలాడు. ఆ చిన్నారి రాష్ట్రంలోని ఓర్లిలో ఉన్న సూర్య నారాయణ్ నోడల్ హయ్యర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థి. అతని పేరు రుద్ర నారాయణ్ సేథి అని తెలుసతోంది. మంగళవారం, 10 ఏళ్ల విద్యార్థి రుద్ర మధ్యాహ్నం 3 గంటలకు తరగతి సమయంలో పాఠశాల ఆవరణలో మరో నలుగురు తోటి విద్యార్థులతో ఆడుకుంటూ కనిపించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఓ ఉపాధ్యాయుడు అందుకు శిక్షగా విద్యార్థిని గుంజీలు తీయమని ఆదేశించాడు. ఈ క్రమంలో చిన్నారి కిందపడిపోయాడు. దీని తరువాత రసూల్పూర్ బ్లాక్‌లోని ఓర్లి గ్రామంలో నివసిస్తున్న అతని తల్లిదండ్రులకు సంఘటన గురించి సమాచారం అందించారు.
చిన్నారిని సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తన పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో మంగళవారం రాత్రి కటక్‌లోని SCB మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు తను చనిపోయినట్లు ప్రకటించారు. ఈ విషయమై రసూల్పూర్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో) నీలాంబర్ మిశ్రాను సంప్రదించారు. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఫిర్యాదు అందగానే తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో రసూల్పూర్ అసిస్టెంట్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రవంజన్ పతి కూడా పాఠశాలను సందర్శించి సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.