భారత క్రికెట్ హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. తననే కొనసాగించడానికి బీసీసీఐ సుముఖత చూపినా, ద్రావిడ్ ఆసక్తి కనబరుస్తలేడు. ఆయన ప్లేస్‌లో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నారు.
Dravid showed no interest as India's head coach. VVS Laxman replaced him
Rahul Dravid: భారత్ టీమ్ ఎన్నడు లేని పటిష్టతను కనబరుస్తూ వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ వరకు రాణించింది. కప్ గెలుస్తుందని అందరూ భావించారు. ఊహించని ఓటమిని చవిచూసింది. పరాజయం మిగిల్చిన బాధను క్రికెట్ అభిమానులు జీర్ణించుకోవడం లేదు. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తన కాంట్రాక్టు అయిపోయింది. దాన్ని పొడిగించడానికి బీసీసీఐ చొరువ చూపిస్తున్నా రాహుల్ పెద్దగా ఆసక్తిని చూపడం లేదని తెలిసింది. ఆయన స్థానాన్ని భర్తీ చేయడానకి నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
చదవండి:Animal Trailer: తండ్రిని పిచ్చిగా ప్రేమించే కొడుకు
వరల్డ్ కప్ అయిపోవడంతో రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ పదవీకాలం ముగిసింది. అతని నిబద్ధత, పని విధానంతో హెడ్ కోచ్‌గా కొనసాగించాలని భావిస్తున్నా.. ద్రావిడ్ మాత్రం అందుకు సిద్ధంగా లేడని సమాచారం. ఈయన కోచింగ్‌లో టీమిండియా జట్టు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరుకుంది. ఈ రెండు సందర్భాల్లో ఇండియా ఆస్ట్రేలియా చేతిలోనే ఓడింది. ఈ రోజు నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్ కు లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్ గా బాధ్యతలు చేబట్టారు.