ELR: జీలుగుమిల్లిలోని GMSK సభ్యులతో ఎస్సై వి. క్రాంతి కుమార్ సమావేశం నిర్వహించారు. అన్ని పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు పోక్సో, సైబర్ క్రైమ్స్, శక్తి యాప్, డ్రగ్స్ చట్టాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపించినా ముందస్తు సమాచారం పోలీస్ స్టేషన్కు ఇవ్వాలని స్పష్టంగా సూచించారు.