AP: శాసనమండలి రేపటికి వాయిదా పడింది. తిరుమల లడ్డూ అంశంపై మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇరుపక్షాల నినాదాల మధ్య మండలిని ఛైర్మన్ మోషేన్ రాజు వాయిదా వేశారు. తిరుమల లడ్డూ అంశంపై చర్చించకుండానే వాయిదా పడింది.
CTR: పుంగనూరు తహశీల్దార్ కార్యాలయంలో రేపు మండల స్థాయి విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు MRO రాము గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, కమిటీ
NRPT: ఉట్కూర్ మండలంలోని రెండో బ్యాచ్ నూతన సర్పంచులకు ఐదు రోజులపాటు నిర్వహించిన ఓరియంటేషన్ శిక్షణ ముగిసింది. ముగింపు వేడుకలకు కలెక్టర్ సిక్త పట్నాయక్, డీపీవో హాజరై సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. పలు గ్రామాల సర్పంచులతో పాటు మల్లేపల్లి సర్పంచ
RR: శంషాబాద్ మండలం, నర్కూడ గ్రామంలో ఇవాళ బొడ్రాయి ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా, గ్రామ సర్పంచ్ శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్రాయికి అభిషేకం చేసి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నర్కూడ గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామం అన్ని వ
SRD: నారాయణఖేడ్ మున్సిపల్ అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ శెట్కార్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని గురువారం కలిశారు. జాతీయ రహదారి 161 (బీ) నిజాంపేట్-నారాయణఖేడ్ మీదుగ
HYD: నకిలీ టీ పౌడర్ తయారు చేస్తూ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు జగన్నాథ్ పట్టుబడ్డాడు. సింథటిక్ రసాయనాలతో టీ పౌడర్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక కిలో కల్తీ టీ పొడికి 450 గ్రాముల నాణ్యతలేని టీ డస్ట్ ఉపయోగిస్తున్నారని, 500 గ్రాముల నాణ్యతల
TPT: టర్కీలో జరిగే ఇంటర్నేషనల్ గోల్ బాల్ పోటీలకు వెంకటగిరికి చెందిన అంధ యువకుడు ముప్పాళ్ల శేషగిరి ఎంపికయ్యాడు. పాట్నాలో జరిగిన పోటీల్లో ఏపీ తరఫున అతను పాల్గొన్నాడు. అక్కడ ప్రతిభచూపడంతో జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. దీంతో అతడిని తిరుపతి ఎస్పీ
GNTR: గుంటూరులో గురువారం జరిగిన ‘మా-ఏపి’ యూనియన్ సమావేశంలో దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల నటీనటులు, సాంకేతిక నిపుణుల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. AI వినియోగంపై సెన్సార్ బోర్డు తక్షణ
SRD: పటాన్చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి కోరారు. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజనను కలిసి వినతి పత్రం అందజేశారు. బాంబే కాలనీ రైతు బజార్లో సింగిల్-బిడ
NZB: భీమగల్ మండలంలోని పురాణీపేట్ సర్పంచ్ బుర్ర సుమ ఆమె భర్త దేవేందర్ గౌడ్ గురువారం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రె