VSP: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈనెల 6, 7వ తేదీల్లో సమాచార కమిషనర్ సుధారాణి రేలంగి పర్యటించనున్నారు. 6న ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకోనున్నారు. 7న ఉదయం 10 గంటలకు DSNLUలో జరిగే దక్షిణ ప్రాంత లా రివ్యూ కన్సల్టేషన్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యటనకు అధికారులు
AP: హైకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించిన ఫలితాల్లో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) 40 పోస్టుల్లో 30 మంది మహిళా న్యాయవాదులు ఎంపికయ్యారు. నేరుగా నియామకం ద్వారా సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరులో హైకోర్టు రాతపరీక్ష నిర్వహించింది. అనంతరం ఇ
AKP: నక్కపల్లి మండలం బోయపాడు తీర ప్రాంతంలో జట్టి నిర్మాణానికి స్థలాన్ని మత్స్యశాఖ అధికారులు TDP నాయకులు శనివారం పరిశీలించారు. నక్కపల్లి మండలం తీర ప్రాంతంలో ప్రభుత్వం జట్టీ మంజూరు చేసింది. రూ.32 కోట్ల వ్యయంతో జట్టీ నిర్మించనున్నట్లు అధికారులు తె
AP: రాష్ట్రానికి రానున్న రోజుల్లో తీవ్ర వడగాలుల ముప్పు ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ 17 మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉండనుంది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, పోలవరం, తూర్పు గోదావరి జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీయనున్నాయి. ఉదయం 10 గంట
BDK: మణుగూరు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు శనివారం రాత్రి వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ తనిఖీలను డీఎస్పీ రవీందర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. తోగ్గుడెం వద్ద ప్రధాన రహదారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద వా
KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి రథోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు కార్యకర్తలు, ప్రజలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తులతో కలిసి రథాన్
MBNR: మహమ్మదాబాద్ మండలంలో ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ – 2026’ శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. ముస నరసింహ మాట్లాడుతూ.. సోషల్ మీడియా, ఏఐ సాంకేతికతను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించా
ADB: జిల్లా శిక్షణ కలెక్టర్గా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న సలోని చాబ్రాకు జిల్లా యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా సలోని చాబ్రాను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. సలోని మాట్లాడుతూ.. కలెక్టర్ మార్
KMM: గజ్వేల్లో కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. వాగ్దానాల అమలులో విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతుందన్నారు. ఎమ్మెల్యే కా
MDK: తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్ గ్రామపంచాయతీలో డీఎల్పీవో యాదయ్య విచారణ చేపట్టారు. గ్రామంలో బోరు మోటర్లు ఏర్పాటు చేయడంలో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. డీపీవో ఆదేశాల మేరకు డీఎల్పీవో యాదయ్య గ్రామంలో వ