ADB: జిల్లా శిక్షణ కలెక్టర్గా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న సలోని చాబ్రాకు జిల్లా యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా సలోని చాబ్రాను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. సలోని మాట్లాడుతూ.. కలెక్టర్ మార్గదర్శకత్వంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, తోటి అధికారులు, సిబ్బంది అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.