BDK: మణుగూరు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు శనివారం రాత్రి వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ తనిఖీలను డీఎస్పీ రవీందర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. తోగ్గుడెం వద్ద ప్రధాన రహదారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద వాహనాలను ఆపీ పత్రాలను పరిశీలిస్తున్నారు. వారితో సీఐ నాగబాబు, ఎస్సైలు నగేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.