KMM: గజ్వేల్లో కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. వాగ్దానాల అమలులో విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతుందన్నారు. ఎమ్మెల్యే కార్యాలయం ప్రభుత్వ ఆస్తి అని, దానిపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.