MBNR: మహమ్మదాబాద్ మండలంలో ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ – 2026’ శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. ముస నరసింహ మాట్లాడుతూ.. సోషల్ మీడియా, ఏఐ సాంకేతికతను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని మోదీపై జరుగుతున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టి, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.